![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -87 లో......ప్రేమ భద్రవతి దగ్గరికి వెళ్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు ఆలోచించుకొని వచ్చావా.. నిర్ణయం తీసుకొని వచ్చావా అని భద్రవతి అడుగుతుంది. నువ్వు నన్ను మోసం చేసి వెళ్లిపోయావని భద్రవతి ఎమోషనల్ అవుతుంటే.. నిన్ను నా తల్లిలా అనుకున్న చిన్నపటి నుండి నీ గుండెలపై పెరిగానని ఈ పెళ్లి నా తలరాతలో రాసి ఉంది. ఇప్పుడేం చెయ్యలేం మావయ్యపై పెట్టిన కేసు వెనక్కి తీసుకో అత్తయ్య అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది.
అయితే ఒక కండిషన్ నీ మెడలో తాళి తీసేసి శాశ్వతంగా ఈ ఇంటికి వచ్చేయమని అనగానే.. ప్రేమ షాక్ అవుతుంది.. తాళి తియ్ అంటూ భద్రవతి ప్రేమ తాళి తీస్తుంటే ప్రేమ ఆపుతుంది. ఇన్ని రోజులు దీని విలువ తెలియదు కానీ ఇప్పుడు నువ్వు తీస్తుంటే ఏదో బాధగా ఉంది.. నేను తీయనని ప్రేమ అంటుంది. ప్రేమ నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్తున్నావ్.. మళ్ళీ వస్తావని భద్రవతి అనుకుటుంది. మరుసటి రోజు ఇరు కుటుంబాలని సీఐ రాజీకి పిలుస్తాడు. భద్రవతి గారి మేనకోడలని శాశ్వతంగా వాళ్ళ ఇంటికి పంపండి లేదా నగలు తీసుకొని ఇవ్వండి అని సీఐ అంటాడు. వాళ్ళ మేనకోడలని వాళ్ళ ఇంటికి పంపిస్తునట్లు సంతకం చెయ్యండి అని సీఐ రామరాజుతో అనగానే రామరాజు ఆ పేపర్ చింపేసి జైలుకి అయినా వెళ్తాను కానీ వాళ్ళని విడదియ్యనని రామరాజు అంటాడు. అయితే రామరాజు, ధీరజ్ లని జైలుకి తీసుకొని వెళ్ళాలని సీఐ అనగానే.. నగలు నావి తప్పు చేసింది నేను.. నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రేమ అంటుంది.
ప్రేమ తప్పుకోమని భద్రవతి అంటుంది. మీపై ప్రేమ, అభిమానం ఉన్నాయి. మీరు ఇలా కుట్ర చేసి ఇలా చేసి మీ నమ్మకం పోగొట్టుకోకండి అని భద్రవతితో ప్రేమ కఠినంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో నీ వల్లే నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చిందంటూ సాగర్, చందు లు ధీరజ్ ని తిడతారు. అదంతా చుసిన ప్రేమ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ప్రేమ ఎక్కడ కన్పించకపోయేసరికి భద్రవతి తీసుకొని వెళ్లి ఉంటుందని.. వేదవతి కోపంగా తన ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |